![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -387 లో.. నాకు ఈ కాంపిటేషన్ లో పాల్గొనాలని లేదు.. ప్లీజ్ ఏదో ఒకటి చేసి ఇది క్యాన్సిల్ చేయండి అని ఆదర్శ్ ని ముకుంద రిక్వెస్ట్ చేస్తుంది. ఇక పూర్తిగా ముకుంద మాయలోనున్న ఆదర్శ్.. తను ఏం చెప్పినా చేస్తుంటాడు. ఆ తర్వాత ముకుంద అన్న మాటల గురించి ఆదర్శ్ ఆలోచిస్తుంటాడు.
ఆ తర్వాత ఆదర్శ్ దగ్గరికి మధు వచ్చి.. దేని గురించి అంత డీప్ గా ఆలోచిస్తున్నావు.. ఏం కష్టం వచ్చింది చెప్పు అంటూనే, అసలు ఆ తొండ అక్కడికి ఎలా వచ్చింది అంటు మళ్ళీ తొండ టాపిక్ తీస్తుంటాడు. ఎలా వచ్చిందో చెప్తాను అంటు ఆదర్శ వెటకారంగా తొండ గుడ్డులో నుoడి వచ్చిందని చెప్పి వెళ్ళిపోతాడు. మధు అలాగే చూస్తూ ఉండిపోతాడు. మరొకవైపు తన ఫ్రెండ్ తో కాల్ మాట్లాడి మురారి కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. ఏమైంది మీ ఫ్రెండ్ తో మాట్లాడి అలా చేస్తున్నారని కృష్ణ అడుగుతుంది. తను మనకి ఈ కాంపిటేషన్ కండక్ట్ చేసి హెల్ప్ చేస్తున్నాడని చెప్పాను కదా, ఆ కాంపిటేషన్ క్యాన్సిల్ చేసాడనే కోపంగా ఉందని మురారి అంటాడు. క్యాన్సిల్ అయి మంచి పని అయింది.. ఎందుకంటే ఇప్పుడు ఈ కాంపిటీషన్ ని మనమే ఇంట్లో కండక్ట్ చేసుకుందాం.. మనమే విన్నర్ ని డిసైడ్ చేద్దామని కృష్ణ అనగానే.. అవును నిజమే తింగరి అని మురారి అంటాడు. ఈ విషయం వెళ్లి ఇంట్లో వాళ్ళకి చెప్పాలని ఇద్దరు అనుకుంటారు.
ఆ తర్వాత ముకుంద, ఆదర్శ్ ఇద్దరు కిందకి వస్తారు. ఆదర్శ్ కాంపిటీషన్ వద్దని భవానికి చెప్పాలని అనుకుంటాడు. ఆ తర్వాత నువ్వు ఏం చెయ్యాలని అనుకుంటున్నావు.. జాబ్ మానేశావ్ కదా? ఇప్పుడేం చేస్తావని భవాని అడుగుతుంది. నువ్వేం చెప్తే అదే చేస్తానమ్మ అని ఆదర్శ్ చెప్తాడు. అప్పుడే కృష్ణ, మురారి ఇద్దరు అక్కడికి వస్తారు. కాంపిటేషన్ ఎక్కడ వరకు వచ్చింది.. ముకుంద డాన్స్ ఇరగదీస్తుందని నందు అనగానే.. అసలు కాంపిటీషన్ క్యాన్సిల్ అయిందని మురారి చెప్తాడు. ముకుంద హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడ క్యాన్సిల్ అయినా.. దాన్ని మనం ఇంట్లో చేసుకుందాం.. మనమే విన్నర్ ని అనౌన్స్ చేద్దామని కృష్ణ చెప్పగానే.. మళ్ళీ ముకుందలో టెన్షన్ మొదలవుతుంది. ఆ తర్వాత బయటకు వెళ్ళాలని కృష్ణ, మురారి వాళ్ళతో పాటు ఆదర్శ్, ముకుంద కూడా అనుకుంటరు. నువ్వు ఇలా రెడీ అయ్యావ్ ఏంటని ఆదర్శ్ లో మురారిని ఉహించుకొని ముకుంద మాట్లాడుతుంది. నిజంగానే ముకుంద తనతో ప్రేమగా మాట్లాడుతుందని ఆదర్శ్ ఆ భ్రమలో ఉండి.. ఇప్పుడే వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుంటానని వెళ్తాడు.. ఆ తర్వాత కృష్ణ రెడీ అవుతుంటే మురారి తన బ్లౌస్ హ్యాంగింగ్స్ సెట్ చేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలాంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |